హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.)
: హయత్‌నగర్ పీఎస్ పరిధి పెద్ద అంబర్‌పేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. సదాశివ గేటెడ్ కమ్యూనిటీలో రెండిళ్లలో చోరీ చేశారు. సెంట్రల్ లాక్ ఉన్న డోర్లు బద్దలు కొట్టి చోరీకి పాల్పడ్డారు. 5 కేజీల వెండి, 35 గ్రాముల బంగారం, రూ.60వేల నగదు, విలువైన చీరలను అపహరించారు. చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాప్
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ