తిరుపతి, 13 అక్టోబర్ (హి.స.)
:నగరంలో ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. రాత్రి హాస్టల్ వద్ద విద్యార్థులకు చిరుత కన్పించడంతో సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. చిరుతను చూసిన విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ మేరకు సమాచారం అందుకున్న అధికారులు యూనివర్సిటీకి చేరుకుని చిరుత ఆనవాలను గుర్తించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ