కర్నూలు, 13 అక్టోబర్ (హి.స.)
, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ఆయా ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. ఈనెల 16వ తేదీన ప్రధాని శ్రీశైలం, కర్నూలులో పర్యటించనున్నారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈరోజు (సోమవారం) సాయంత్రానికి పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈనెల 16న రూ.13,429 కోట్ల అంచనాలతో నిర్మించబోయే 16 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ - బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్‌కు రూ.2,786 కోట్లతో అభివృద్ధి పనులకు.. అలాగే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్‌కు అభివృద్ధి కోసం రూ.2,136
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ