కడప, 13 అక్టోబర్ (హి.స.)
:నగరంలోని శంకరాపురంలో విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్త తమ కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముగ్గురూ కలిసి అర్ధరాత్రి సమయంలో కృష్ణాపురం సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద గూడ్స్ రైలు క్రిందపడి ప్రాణాలు తీసుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు డెడ్ బాడీలను శ్రీరాములు, ఆయన భార్య శిరీష, కుమారుడు రుత్విక్‌గా పోలీసులు గుర్తించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ