ఏపీకి పటిష్టమైన నాయకత్వం ఉంది.. సీఎం, డిప్యూటీ సీఎంలపై ప్రధాని ప్రశంసలు
కర్నూలు, 16 అక్టోబర్ (హి.స.)ఆత్మగౌరవం, సంస్కృతికి ఆంధ్రప్రదేశ్ నిలయమని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అన్నారు. ఇవాళ కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 (GST 2.0) సంస్కరణలతో ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించి చెప్పేందుకు కర్నూలులో ఏర్పాటు చేస
prime-minister-modi-virtually-launched-various-projects-from-the-super-gst-sup


Modi


కర్నూలు, 16 అక్టోబర్ (హి.స.)ఆత్మగౌరవం, సంస్కృతికి ఆంధ్రప్రదేశ్ నిలయమని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అన్నారు. ఇవాళ కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 (GST 2.0) సంస్కరణలతో ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించి చెప్పేందుకు కర్నూలులో ఏర్పాటు చేసిన ‘సూపర్‌ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్‌’ బహిరంగ ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. సోదర, సోదరీమణులకు నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. అహోబిళం, మహానంది, మంత్రాలయం స్వాముల వారి ఆశీస్సులు కోరుతున్నానని అన్నారు. తాను కూడా సోమనాథుడు కొలువైన గడ్డపై పుట్టానని పేర్కొన్నారు. నేడు ఆ విశ్వనాథుడి (శ్రీశైల మల్లికార్జునిడు)కి సేవ చేసే భాగ్యం కలిగిందని కామెంట్ చేశారు. ద్వితీయ జ్యోతిర్లింగమైన మల్లికార్జున స్వామి ఆశీస్సులు పొందానని అన్నారు. శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి శ్రద్ధాంజలి అర్పించానని తెలిపారు. ఆత్మగౌరవం, సంస్కృతికి ఏపీ నిలయమని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలోనూ యువశక్తి ఉందని ప్రధాని మోడీ తెలిపారు.

చంద్రబాబు, పవన్ రూపంలో ఏపీకి శక్తివంతమైన నాయకత్వం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 16 నెలల్లో అభివృద్ధి డబుల్ ఇంజిన్‌లా దూసుకెళ్తోందని తెలిపారు. అభివృద్ధి కోసం ఢిల్లీ, అమరావతి కలిసి పని చేస్తున్నాయని అన్నారు. కేంద్ర నుంచి ఏపీకి సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో 15 లక్షల ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయబోతున్నామని తెలిపారు. దేశంలో ఇంధన విప్లవానికి ఏపీ కేరాఫ్‌గా మారబోతోందని అన్నారు. 2047 నాటిని వికసిత్ భారత్ సంకల్పంతో సాగోతందని, ఆ లక్ష్యానికి స్వర్ణాంధ్ర ఎంతో సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. భారత్, ఏపీ అభివృద్ధిని ప్రపంచం గమనిస్తోందని అన్నారు. గూగుల్ లాంటి కంపెనీ ఏపీలో పెట్టుబడి పెడుతోందని.. అమెరికా బయట అతిపెద్ద పెట్టుబడి పెడుతున్నట్లుగా గూగుల్ సీఈవో చెప్పారని వెల్లడించారు. విశాఖలో AI హబ్, డేటా సెంటర్, సబ్ సీ కేబుల్ వంటి భారీ ప్రాజెక్టులు వచ్చాయన్నారు. ఇక సబ్ సీ కేబుల్ వ్యవస్థకు విశాఖ గేట్ వేగా మారబోతోందని అన్నారు. ఏపీ అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి చాలా ముఖ్యమని, సీమలోని ప్రతి జిల్లాలో ఉపాధి కల్పించేలా ప్రాజెక్టులు పెడతామని ప్రధాని మోడీ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande