తెలంగాణ, 19 అక్టోబర్ (హి.స.)
వరుస లొంగుబాట్లపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. మల్లోజుల (Mallojula), ఆశన్న (Ashanna) విప్లవ ద్రోహులుగా మారారని కేంద్ర కమిటీతో చర్చించకుండానే వారు లొంగిపోయారని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ (Abhay) పేరుతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ తాజాగా లేఖను విడుదల చేసింది. విప్లవ ద్రోహులుగా, పార్టీ విచ్ఛిన్నకారులు, విప్లవ ప్రతిఘాతకులుగా మారి శత్రువులకు లొంగిపోయిన మల్లోజుల, ఆశన్న ముఠాను నుంచి బహిష్కరిస్తున్నామని స్పష్టం చేసింది. వారికి తగిన శిక్ష విధించాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తున్నామని లేఖలో పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు