హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.)
రెగ్యులర్ గా ప్రయాణికులను తనిఖీ
చేస్తున్న మెట్రో 8 సిబ్బందికి ఉహించని వస్తులు కనిపించాయి. అనుమానం వచ్చి ప్రయాణికుడి బ్యాగ్ చెక్ చేయగా.. ఏకంగా బుల్లెట్ బయటపడింది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ లోని ముసాపేట్ మేట్రో స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి మహమ్మద్ అనే యువకుడు మూసాపేట్ మెట్రో స్టేషన్ కు వచ్చాడు. అయితే సెక్యూరిటీ సిబ్బంది సాధారణ తనిఖీల్లో భాగంగా అతని బ్యాగ్ చెక్ చేయగా.. మహమ్మద్ వద్ద బుల్లెట్ ఉన్నట్లు గుర్తించారు.
పూర్తిగా అప్రమత్తమై బ్యాగును పరిశీలించగా.. మహమ్మద్ వద్ద 9 ఎంఎం బుల్లెట్ లభ్యం అయింది. దీంతో మెట్రో సిబ్బంది వెంటనే కూకట్ పల్లి పోలీసుల కు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు