ఆసిఫాబాద్, 19 అక్టోబర్ (హి.స.): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆసిఫాబాద్ మండలం మోతుగూడ వద్ద జాతీయ రహదారిపై కారు.. బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వాంకిడి మండలం బెండారం గ్రామానికి చెందిన ఓ యువకుడు దీపావళి పండుగకు సోదరి, ఆమె పిల్లలను తీసుకెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో జగన్ (27), అక్క అనసూయ(32), ప్రజ్ఞశీల్(4) మృతి చెందారు. మరో పాపకు తీవ్రగాయాలు కావడంతో కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు