హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.)తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. తల్లిదండ్రులు, గ్రామస్థులు, కమ్యూనిస్ట్ నాయకులు కన్నీటిపర్యంతమై తుది వీడ్కోలు పలికారు. ఆయన అంత్య క్రియలకు భారీగా ప్రజా సంఘాలు, కవులు తరలివచ్చారు. గతనెల 22న ఛత్తీస్ గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని అబుజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌లో రామచంద్రారెడ్డి మరణించారు. ఈ క్రమంలోనే శనివారం స్వగ్రామం తీగలకుంట గ్రామానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. ఆదివారం బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు