హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.) నిన్న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో
జరిగిన బీసీ బంద్ నేపథ్యంలో బీసీ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంపై బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah) ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగలు, నక్సలైట్లను అరెస్టు చేసినట్లుగా బీసీ నేతలను అర్ధరాత్రి అరెస్టు చేస్తారా అని మండిపడ్డారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రులు అరెస్టు చేయడం సరికాదన్నారు. ఇవాళ ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఆర్. కృష్ణయ్య.. నిన్నటి బంద్ సందర్భంగా చిన్న చిన్న సంఘటనలు జరిగాయని వీటిని ఆసరగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఉద్యమాన్ని అణిచివేయాలని కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. పెద్ద ఎత్తున బంద్ జరిగిందని కానీ పోలీసులు ఉద్దేశపూర్వకంగానే బీసీ నాయకులను అర్ధరాత్రి అరెస్టు చేశారన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు