ఖమ్మం, 19 అక్టోబర్ (హి.స.)
ప్రజలు ఎంతో నమ్మకంతో నన్ను
గెలిపించారు. వారి నమ్మకంను ఒమ్ము చేయకుండా ప్రజల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తానని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ అన్నారు. ఏన్కూర్ మండలంను సుమారు, 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే అన్నారు. సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చుతో సీతారామ ప్రాజెక్టు కాలువ పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని అన్నారు.
50 కోట్లు రూపాయలతో ఐటీఐ కాలేజీ మంజూరు చేశామని, స్థల సేకరణ కోసం అధికారులకు ఆదేశాలు ఇచ్చారని అన్నారు. మేడిపల్లి గ్రామం సమీపంలో లోతువాగు పై నూతనంగా బ్రిడ్జి నిర్మాణం జరపడంతో ఆ ప్రాంత ప్రజల సమస్యకు పరిష్కారం లభించిందని ఆయన అన్నారు. మేడిపల్లి లోతు వాగు పై 3.5 కోట్లతో చెక్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేశామని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు