యాదవ సోదరులకు మరిన్ని రాజకీయ అవకాశాలు కల్పిస్తాం.. సదర్ సమ్మేళనంలో సీఎం
తెలంగాణ, 19 అక్టోబర్ (హి.స.) హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ఆదివారం ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎంకు డబ్బు చప్పుళ్లతో కళాకారులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కల
సీఎం రేవంత్ రెడ్డి


తెలంగాణ, 19 అక్టోబర్ (హి.స.)

హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ఆదివారం ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎంకు డబ్బు చప్పుళ్లతో కళాకారులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. యాదవరాజులు పరిపాలించిన నాటి నుండి హైదరాబాద్ లో సదర్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారని అన్నారు.

ఏ కష్టం వచ్చినా నమ్మినవారికి అండగా ఉండటం యాదవ సోదరుల లక్షణం అని చెప్పారు. యాదవ సోదరులు ప్రభుత్వానికి సహకరించడం వల్లనే హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు కాపాడి, ప్రపంచ పెట్టుబడులకు నగరం నిలయమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరవాత సదర్ ను రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని కోరిన వెంటనే దానికి అంగీకరించామని చెప్పారు. యాదవులకు మరిన్ని రాజకీయ అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తప్పకుండా వాటిని కల్పిస్తామని హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande