గాంధీని హత్య చేసిన మతతత్వవాదులు బ్రిటీషర్ల కంటే ప్రమాదం! సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.) గాంధీ కుటుంబం దేశంలో శాంతి, సామరస్యతను కాపాడుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీని హత్య చేసిన మతతత్వవాదులు బ్రిటీషర్ల కంటే ప్రమాదం అని పేర్కొన్నారు. చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమాన
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.)

గాంధీ కుటుంబం దేశంలో శాంతి, సామరస్యతను కాపాడుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీని హత్య చేసిన మతతత్వవాదులు బ్రిటీషర్ల కంటే ప్రమాదం అని పేర్కొన్నారు. చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మూడు తరాలుగా దేశం కోసం గాంధీ కుటుంబం పనిచేస్తోందన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేసే వారిని తిప్పికొట్టాలన్నారు. బీసీ కులగణన చేసి వందేళ్ల సమస్యకు పరిష్కారం చూపించాం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

'రాజీవ్ గాంధీ గురించి ఎంత చెప్పినా తక్కువే. గాంధీ అనే పదం ఈ దేశానికి పర్యాయ పదం. అన్ని మతాల సహజీవనం ఎలా స్ఫూర్తి ఇస్తుందో.. గాంధీ అనే పదం కూడా అదే స్పూర్తినిస్తుందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande