కర్నూలు, 16 అక్టోబర్ (హి.స.) కర్నూలు(Kuranool), కడప(Kadapa) ప్రజలకు సీఎం చంద్రబాబు(Cm Chandrababu) గుడ్ న్యూస్ తెలిపారు. ప్రధాని మోడీ(Pm Modi) సమక్షంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో నిర్వహించిన జీఎస్టీ బహిరంగ సభలో ప్రధాని మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan)తో చంద్రబాబు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కడపలో స్టీల్ ప్లాంట్, స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాయలసీమకు సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు.
‘‘సరైన సమయంలో సరైన చోట సరైన వ్యక్తిగా ప్రధాని మోడీ ఓ విశిష్టమైన వ్యక్తి.. 21వ శతాబ్దపు నేత. ఎందరో ప్రధానమంత్రులతో కలిసి పని చేసినా మోదీ లాంటి వ్యక్తిని చూడలేదు. విరామం, విశ్రాంతి లేకుండా నిర్విరామంగా ప్రజాసేవలోనే ఉంటున్న అరుదైన వ్యక్తి మోడీ. ప్రధాని మోడీ తెచ్చిన సంస్కరణలు దేశానికి గేమ్ చేంజర్లుగా మారాయి. ప్రగతిశీల దేశంగా 2047 నాటికి భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచి సూపర్ పవర్‌గా తయారవుతుంది. 11 ఏళ్లలో 4 కోట్ల కుటుంబాలకు పక్కా ఇళ్లు, 81 కోట్ల మందికి ఉచితంగా రేషన్, 144 వందే భారత్ రైళ్లు, 55 వేల కి.మీ మేర కొత్త హైవేలు, 86 ఎయిర్ పోర్టులు, 16 ఎయిమ్స్ ఆస్పత్రులు నిర్మించిన ఘనత ప్రధాని మోడీదే. 7 ఐఐటీలు, 8 ఐఐఎంలను తీసుకువచ్చిన రికార్డు కూడా ప్రధాని మోడీదే ఇది ఆల్ టైం రికార్డు. ప్రధాని సంకల్పంతోనే 11 ఏళ్ల క్రితం 11వ ఆర్ధిక వ్యవస్థగా ఉన్న భారత్ 4వ స్థానానికి వచ్చింది. 2028 నాటికి 3వ, 2038కి 2వ ఆర్ధిక శక్తిగా భారత్ ఎదుగుతుంది. ఆర్థికంగా మనం బలం ఏంటో ఈ విజయాలు చెబితే...సైనికంగా మన బలం ఏంటో ఆపరేషన్ సింధూర్ చాటింది.’’ అని చంద్రబబు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV