శ్రీకాకుళం జిల్లా.భారీ స్థాయిలో. గంజాయిని.పోలీసుల ద్వారా ఈగల్ టీమ్ స్వాధీనం
శ్రీకాకుళం17 అక్టోబర్ (హి.స.),శ్రీకాకుళం జిల్లాలో భారీస్థాయిలో గంజాయిని పోలీసుల ఆధ్వర్యంలో ఈగల్‌ టీమ్‌ స్వాధీనం చేసుకుంది. ఎస్పీ మహేశ్వరరెడ్డి కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజయాబాద్‌కు చెందిన సునీల్‌, మేరఠ్‌కు చెందిన విశాల్‌.. ఒడిశా రాష్ట్రంలో 209
శ్రీకాకుళం జిల్లా.భారీ స్థాయిలో. గంజాయిని.పోలీసుల ద్వారా ఈగల్ టీమ్ స్వాధీనం


శ్రీకాకుళం17 అక్టోబర్ (హి.స.),శ్రీకాకుళం జిల్లాలో భారీస్థాయిలో గంజాయిని పోలీసుల ఆధ్వర్యంలో ఈగల్‌ టీమ్‌ స్వాధీనం చేసుకుంది. ఎస్పీ మహేశ్వరరెడ్డి కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజయాబాద్‌కు చెందిన సునీల్‌, మేరఠ్‌కు చెందిన విశాల్‌.. ఒడిశా రాష్ట్రంలో 209 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. దానిని ప్యాకెట్ల రూపంలో కారులో ఉత్తరప్రదేశ్‌కు రవాణా చేస్తుండగా.. శ్రీకాకుళం జిల్లా పొందూరు-చిలకపాలెం మధ్య పోలీసులకు పట్టుబడ్డారు. వారిద్దరినీ అరెస్టు చేసి.. గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande