రాత్రికి రాత్రే కూల్చివేతలు.. బాధితుల ఆగ్రహం
నారాయణపేట, 19 అక్టోబర్ (హి.స.) నారాయణపేట జిల్లా మద్దూరు పట్టణ కేంద్రంలో అభివృద్ధిలో భాగంగా ప్రధాన రహదారులను రెండు లైన్లు గా మార్చే పనులు జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా రెనివట్ల చౌరస్తా నుండి కన్యకా పరమేశ్వరి దేవాలయం వరకు రోడ్డు మధ్య నుంచి రె
కూల్చివేతలు


నారాయణపేట, 19 అక్టోబర్ (హి.స.) నారాయణపేట జిల్లా మద్దూరు

పట్టణ కేంద్రంలో అభివృద్ధిలో భాగంగా

ప్రధాన రహదారులను రెండు లైన్లు గా మార్చే పనులు జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా రెనివట్ల చౌరస్తా నుండి కన్యకా పరమేశ్వరి దేవాలయం వరకు రోడ్డు మధ్య నుంచి రెండు వైపులా 35 ఫీట్ల చొప్పున మొత్తం 70 ఫీట్లు మధ్యలో బట్టర్ ఫ్లై లైట్లతో రహదారిని విస్తరించే పనుల్లో భాగంగా గత వారం రోజుల నుంచి ఇరువైపులా ఉన్న దుకాణాలను కూల్చివేయడంతో పాటు, రోడ్డు పాటు విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి.

అయితే శనివారం రాత్రి ఒంటి గంట తర్వాత చౌరస్తా నుండి ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరి గోడ వైపు 35 ఫీట్లు దాటి అవతలి వైపు మిగిలి ఉన్న దుకాణాల సముదాయాలను కూడా రాత్రికి రాత్రి అధికారులు కూల్చివేయడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande