ఇంద్రకీలాద్రి పై కొలువైన కనకదుర్గమ్మకు రూ.2 కోట్ల విలువైన ఆభరణాల కానుక
విజయవాడ(ఇంద్రకీలాద్రి 17 అక్టోబర్ (హి.స.) : ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు రూ.2కోట్ల విలువైన వజ్రాలతో కూడిన బంగారపు ఆభరణాలను కానుకగా కీర్తిలాల్‌ జ్యూయలరీ నిర్వాహకులు గురువారం రాత్రి అందజేశారు. సూర్య చంద్రుల ఆభరణాలు, ముక్కుపుడక, బులాకీ, బొట్
ఇంద్రకీలాద్రి పై కొలువైన కనకదుర్గమ్మకు రూ.2 కోట్ల విలువైన ఆభరణాల కానుక


విజయవాడ(ఇంద్రకీలాద్రి 17 అక్టోబర్ (హి.స.)

: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు రూ.2కోట్ల విలువైన వజ్రాలతో కూడిన బంగారపు ఆభరణాలను కానుకగా కీర్తిలాల్‌ జ్యూయలరీ నిర్వాహకులు గురువారం రాత్రి అందజేశారు. సూర్య చంద్రుల ఆభరణాలు, ముక్కుపుడక, బులాకీ, బొట్టు, సూత్రాలు, గొలుసు, కంఠాభరణాలను దేవస్థానం ఛైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో శీనానాయక్‌లకు ఆలయ ప్రాంగణంలో ఇచ్చారు. 531 గ్రాముల బంగారం, వజ్రాలతో వాటిని తయారు చేయించారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్‌ సతీమణి లక్ష్మీరవి, మాజీ ఎంపీలు గోకరాజు గంగరాజు, కనుమూరి బాపిరాజు, కీర్తిలాల్‌ జ్యూయలరీ డైరెక్టర్‌ సూరజ్‌ శాంతకుమార్‌ దంపతులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande