హైదరాబాద్, 17 అక్టోబర్ (హి.స.)
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు
అఖిలపక్షంతో ప్రధాని నరేంద్ర మోడీ ని కలవాలనుకున్న అపాయింట్ ఇవ్వలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ నేతలు అపాయింట్మెంట్ ఇప్పిస్తే ప్రధానికి కలుస్తామని తెలిపారు. కానీ, బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందని, రేపటి బంద్ ఆ పార్టీకి వ్యతిరేకంగా జరగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, డిప్యూటీ సీఎం చేసిన ఆరోపణలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లపై డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. 42 శాతం బీసీ కోటాపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. నిజంగానే బీసీలపై ప్రేమే ఉంటే మొదలు కేబినెట్లో అమలు చేసిన చూపించాలని సవాలు విసిరారు. ఫస్ట్ 10 బీసీ బిడ్డలకు మంత్రు ఇవ్వాలన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేనే లేదన్నారు. జణగణన, కులగణన తర్వాతే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..