మహబూబ్నగర్, 17 అక్టోబర్ (హి.స.)
జీవోలు విడుదల చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని చట్టబద్ధతను కల్పించడం ద్వారానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బి ఆర్ ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు. రిజర్వేషన్లు ఖరారు అయ్యాకే ఎన్నికలకు వెళతామని.. మొన్నటికి మొన్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్, సర్పంచి పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేశారని మాజీ మంత్రి గుర్తు చేశారు. ఇది నిలిచేది కాదు అని.. బి ఆర్ ఎస్ చెబుతూనే ఉంది అన్నారు.
రిజర్వేషన్లతో ఎన్నో ఆశలు పెట్టుకున్న నాయకుల ఆశలపై నీళ్లు పోసినట్లు అయ్యింది. బి ఆర్ ఎస్ మొదటి నుంచి అగ్రవర్ణాల లో రిజర్వేషన్ల కోసం కృషి చేసింది.అలాగే ఇప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం మద్దతు ఇస్తుందని మాజీ మంత్రి వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు