నారాయణపేట, 17 అక్టోబర్ (హి.స.)
ఉచిత చేప పిల్లల పంపిణీ లో భాగంగా మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం మక్తల్ మండలం సంగం బండ వద్ద చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రీజర్వాయర్ మరియు మక్తల్ పెద్ద చెరువులో 80 వేల చేప పిల్లలను విడుదల చేశారు.
రాష్ట్రంలో మత్స్య సంపద ను పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు .ఆర్థికంగా ప్రతి ఒక్కరికి విద్యా, వైద్యం అవసరమని, 30 కిలోమీటర్ల కి ఒక ఆసుపత్రి ఉండాలని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో డయాలసిస్ సెంటర్ ఉండాలని, ప్రతి మండలం కేంద్రంలో 35 పడకల ఆసుపత్రి ఉండాలని ఉద్దేశంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు