ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో నల్గొండ జిల్లాకు రాష్ట్రంలో రెండో స్థానం..
నల్గొండ,17 అక్టోబర్ (హి.స.) ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో నల్గొండ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచింది. గృహాల మంజూరు, గ్రౌండింగ్, చెల్లింపులు, పురోగతిలో విశేష ఫలితాలు సాధించినందుకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ పి. గౌతమ్
నల్గొండ కలెక్టర్


నల్గొండ,17 అక్టోబర్ (హి.స.)

ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో

నల్గొండ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచింది. గృహాల మంజూరు, గ్రౌండింగ్, చెల్లింపులు, పురోగతిలో విశేష ఫలితాలు సాధించినందుకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ పి. గౌతమ్ నల్గొండ జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. నల్గొండ జిల్లాకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మొత్తం 19,625 గృహాలు కేటాయించగా, వాటిలో 17,247 గృహాలను మంజూరు చేశారు. ఇప్పటివరకు 13,581 గృహాలు గ్రౌండ్ కాగా, వాటిలో 10,116 గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఒక్క సెప్టెంబర్ నెలలోనే 5,919 గృహాలు గ్రౌండ్ కాగా, 80 కోట్ల రూపాయల చెల్లింపులు లబ్ధిదారులకు అందజేయబడ్డాయి. ఈ విజయాన్ని గుర్తిస్తూ, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి క్యాంపు కార్యాలయంలో పలువురు జిల్లా అధికారులు జిల్లా యంత్రాంగం మరియు గృహ నిర్మాణ శాఖ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande