సూర్యాపేట, 17 అక్టోబర్ (హి.స.)
పోలీస్ సిబ్బంది ఒత్తిడి లేకుండా పని
చేయాలని, టీం వర్క్ తోనే సక్సెస్ సాధ్యమవుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. అనంతగిరి మండల పోలీస్ స్టేషన్ ను శుక్రవారం ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ డైరీని తనిఖీ చేసి మండల పరిధిలో తరచుగా నమోదవుతున్న నేరాలు, ఫిర్యాదుల మొదలగు తీరుతెన్నులు, కేసుల స్థితిగతులు అంశాలను పరిశీలించారు. గ్రామ రిజిస్టర్లు, హిస్టరీ షీట్స్, రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్, పెండింగ్ కేసు ఫైల్స్, కోర్టు డ్యూటీ విధులను, రిసెప్షన్ విధులు, బ్లూ కొట్ విధులు, పెట్రో కార్ విధులు, కేసుల అంతర్జాల నమోదు, సిసి టిఎన్ఎస్ సిస్టం, సిసి కెమెరాల పనితీరు, సెక్షన్ విధులు, ఎస్ హెచ్ ఓ విధులు, పోలీసు పని విభాగాలు, అమలవుతున్న పని విభాగాలను పరిశీలించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు