బీసీ బంద్ ర్యాలీలో అస్వస్థతకు గురైన కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్..
హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.) రాష్ట్రంలో ఉదయం నుండి బీసీ బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దుకాణాలు విద్యాసంస్థలకు సైతం సెలవు ప్రకటించారు. దాదాపు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు బంద్ లో పాల్గొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ స
విహెచ్


హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)

రాష్ట్రంలో ఉదయం నుండి బీసీ బంద్

కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దుకాణాలు విద్యాసంస్థలకు సైతం సెలవు ప్రకటించారు. దాదాపు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు బంద్ లో పాల్గొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ సైతం రాష్ట్రవ్యాప్తంగా బీసీ బంద్ లో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు తమ పార్టీ ఎమ్మెల్యే దానం నాగెందర్, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డితో కలిసి అంబర్ పేట్లో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో వీహెచ్ నడుస్తూ ఒక్కసారిగా అస్వస్థతకు గురై కిందపడిపోయారు.

వెంటనే పక్కన ఉన్న నేతలు ఆయనను పైకి లేపారు. ఇటీవలే వీహెచ్ కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande