ఢిల్లీలో ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ, 18 అక్టోబర్ (హి.స.) ఢిల్లీలోని ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పార్లమెంట్కు కూతవేటు దూరంలో ఉన్న రాజ్యసభసభ్యుల నివాస రెసిడెన్షియల్ కాంప్లెక్స్ బ్రహ్మపుత్ర అపార్ట్ మెంట్లో శనివారం మధ్యాహ్నం ప్రమాదం సంభవించింది. ఈ అ
అగ్నిప్రమాదం


న్యూఢిల్లీ, 18 అక్టోబర్ (హి.స.)

ఢిల్లీలోని ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పార్లమెంట్కు కూతవేటు దూరంలో ఉన్న రాజ్యసభసభ్యుల నివాస రెసిడెన్షియల్ కాంప్లెక్స్ బ్రహ్మపుత్ర అపార్ట్ మెంట్లో శనివారం మధ్యాహ్నం ప్రమాదం సంభవించింది. ఈ అపార్ట్ మెంట్లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఘటన స్థలం వద్దకు చేరుకున్న ఆరు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం బ్రహ్మపుత్ర అపార్ట్ మెంట్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సున్నితమైన ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభంవించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande