కడప, 18 అక్టోబర్ (హి.స.)
అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆహ్వానం అందింది. ఈ మేరకు ముఖ్యమంత్రిని కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ హరిఫుల్లా హుస్సేనీ కలిసి ఆహ్వానం అందజేశారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ ఈ ఉర్సు మహోత్సవాలు జరుగుతున్నాయని.. ఈ ఉత్సవాలకు తప్పనిసరిగా హజరుకావాలని ముఖ్యమంత్రిని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ