రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు దిక్కులేదా.. మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్
హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.) ఖరీఫ్లో వరి సాగు చేసిన అన్నదాతలు శ్రమించి అష్టకష్టాలు పడుతున్నారు. ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చిందనే సంతోషం ఒకవైపు.. వరుస వర్షాలతో ధాన్యాన్ని ఎలా కొపాడుతోకోవాలని తేలియక బాధ మరోవైపు వారిని వెంటాడుతున్నాయి. ఇప్పటిక
బీసీ బంద్


హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)

ఖరీఫ్లో వరి సాగు చేసిన అన్నదాతలు

శ్రమించి అష్టకష్టాలు పడుతున్నారు. ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చిందనే సంతోషం ఒకవైపు.. వరుస వర్షాలతో ధాన్యాన్ని ఎలా కొపాడుతోకోవాలని తేలియక బాధ మరోవైపు వారిని వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు వ్యవసాయ మార్కెట్కు వచ్చిన ధాన్యం కొట్టుకుపోయింది. ఈ క్రమంలోనే ధాన్యం రంగు మారండంతో రైతుల శ్రమను దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలకు లారీలను తీసుకొచ్చి తక్కువ ధరకే వడ్లు కొనుగోలు చేస్తూ అన్నదాతల నోట్లో మట్టి కొడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'X' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. రైతుబంధు లేదు, ఎవరికీ రుణమాఫీ కాలేదని కామెంట్ చేశారు. బోనస్ బోగస్ అయ్యిందని, ధాన్యం కొనుగోళ్లకు దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం అకాల వర్షాలకు కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దవుతుంటే, వరదకు కొట్టుకుపోతూ రైతన్నలు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, కాంగ్రెస్ దొంగలేమో నీకు ఎంత.. నాకు ఎంత అనే వాటాల పంచాయితీల్లో కొట్టుకు చస్తున్నారంటూ.. కేటీఆర్ ట్వీట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande