సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు:ఈటల రాజేందర్
హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.) సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద నిర్వహించిన బంద్ లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో చ
ఈటెల


హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)

సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద నిర్వహించిన బంద్ లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో చెప్పారని, బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసి కూడా బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్నారు. తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని, పెరియార్ మొదలు అనేక గొప్ప ఉద్యమాలు జరిగాయని గుర్తుచేశారు. 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో రెండేళ్ల పాటు బీసీల ఆర్థిక, సామాజిక, విద్య అన్ని రంగాలపై సమగ్ర సర్వే చేసి.. ఆ రిపోర్ట్ తో రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ లో చేర్చారని తెలిపారు.

తెలంగాణలో కూడా కేసీఆర్ ఒక సారి సర్వే చేసి, బీసీ కమిషన్ వేశారని నిజాయితీ లేనందున అమలు కాలేదన్నారు.ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేరుకు కమీషన్లు వేసినా, నిజాయితీ లేదని తప్పుబట్టారు. బీసీలు 52 శాతం ఉంటే 42 శాతం అని కాకి లెక్కలు చెబుతున్నారని, నేను చెప్పేది అబద్దం అయితే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఈటల సవాల్ విసిరారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఒక్క బీసీ, ఒక ట్రైబల్ ముఖ్యమంత్రి కాలేక పోయారని, ఈ రాష్ట్రంలో బీసీలు 8 మంది మంత్రులుండాలి.. కానీ ముగ్గురే ఉన్నారని, ఉన్నా వారికి ఇచ్చిన మంత్రి శాఖలు కూడా చిన్నవేని ఈటల స్పష్టంచేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande