తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమం.. మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు
నాగర్ కర్నూల్, 18 అక్టోబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తరహాలో బీసీ రిజర్వేషన్ల ఉద్యమం కొనసాగాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బీసీ ఐక్య వేదిక రాష్ట్ర పిలుపు మేరకు శనివారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలో బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్రశాంతంగా
మంత్రి జూపల్లి


నాగర్ కర్నూల్, 18 అక్టోబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తరహాలో

బీసీ రిజర్వేషన్ల ఉద్యమం కొనసాగాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బీసీ ఐక్య వేదిక రాష్ట్ర పిలుపు మేరకు శనివారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలో బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్రశాంతంగా బంద్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే నారాయణరెడ్డి హాజరై మద్దతు ప్రకటించారు. బీసీలు విద్యా, ఉద్యోగ రాజకీయ రంగాల్లో తరతరాలుగా వెనుకబడిపోతున్నారని, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి దేశానికి ఆదర్శవంతంగా కుల గణన చేపట్టినట్లు మంత్రి తెలిపారు. కుల గణన నివేదిక ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జీవో ద్వారా గవర్నర్కు పంపగా, బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉందని, కేంద్ర ప్రభుత్వం అనుకుంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కుతాయి అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande