రాష్ట్ర.వ్యాప్తంగా జల.జీవన్ మిషన్. పనులు.వేగం
అమరావతి, 19 అక్టోబర్ (హి.స.) రాష్ట్రవ్యాప్తంగా జల్‌జీవన్‌ మిషన్‌ పనులు వేగం పుంజుకున్నాయి. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు, ప్రతి గ్రామానికి రక్షిత నీటి భద్రతఓ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముం దుకెళ్తోంది. ఈ పనుల వేగవంతానికి ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యా
రాష్ట్ర.వ్యాప్తంగా జల.జీవన్ మిషన్. పనులు.వేగం


అమరావతి, 19 అక్టోబర్ (హి.స.)

రాష్ట్రవ్యాప్తంగా జల్‌జీవన్‌ మిషన్‌ పనులు వేగం పుంజుకున్నాయి. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు, ప్రతి గ్రామానికి రక్షిత నీటి భద్రతఓ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముం దుకెళ్తోంది. ఈ పనుల వేగవంతానికి ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. ప్రతి గ్రామీణ కుటుంబానికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించడం ద్వారా ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. సిబ్బంది సామర్థ్యాల పెంపు, నీటి నాణ్యత, శుద్ధి, సరఫరాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రామీణ రక్షిత తాగునీటి సరఫరా విభాగం సిబ్బందిలో అంతర్గత సామర్థ్యాలు పెంచేలా క్షేత్రస్థాయిలో చిన్న ఉద్యోగి నుంచి రాష్ట్రస్థాయిలోని ఉన్నత ఇంజనీర్‌ వరకు శిక్షణ ఇస్తున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం జల్‌జీవన్‌ మిషన్‌ లక్ష్యాలను దెబ్బతీస్తే...పవన్‌కల్యాణ్‌ కృషి, ప్రణాళిక జల్‌జీవన్‌ మిషన్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. గత ప్రభుత్వ ధోరణి కారణంగా నిధులు మురిగిపోయే పరిస్థితి తలెత్తగా...సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అభ్యర్థనలతో కేంద్రం జల్‌జీవన్‌ మిషన్‌ పథకం నిర్దేశిత గడువును నాలుగేళ్లపాటు పొడిగించింది. ఈ ఏడాది ఐదు జిల్లాల పరిధిలో రూ.7,910 కోట్లతో పనులు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే కోటి మంది దాహార్తి తీరుతుంది. దీంతో రానున్న 30 ఏళ్ల కాలానికి, 1.21 కోట్ల మందికి రక్షిత తాగునీరు ఇవ్వాలన్న సంకల్పం నెరవేర నుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande