పోలీసులు అంటే నమ్మకం.. ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం.. సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 21 అక్టోబర్ (హి.స.) పోలీస్ అంటే నమ్మకం.. విధి నిర్వాహణలో ప్రాణాలు కోల్పోవడానికి సైతం మన పోలీసులు వెనుకంజ వేయడం లేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ లోని పోలీస్ మార్టియర్స్ మెమోరియల్
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 21 అక్టోబర్ (హి.స.)

పోలీస్ అంటే నమ్మకం.. విధి నిర్వాహణలో ప్రాణాలు కోల్పోవడానికి సైతం మన పోలీసులు వెనుకంజ వేయడం లేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ లోని పోలీస్ మార్టియర్స్ మెమోరియల్లో పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. విధి నిర్వహణలో వీరు మరణం పొందిన అమరవీరులకు నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలు తరుపున ముఖ్యమంత్రిగా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాట్టు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 194 మంది తెలంగాణాలో ఆరుగురు అధికారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మూడు రోజుల క్రితం కానిస్టేబుల్ ప్రమోద్ ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కోటీ రూపాయల ఎక్స్రేగ్రేషియా, ఉద్యోగం ఇస్తామమని ప్రకటించారు. బలిమెలలో జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 33 మంది కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. గాజులరామారంలో 200 గజాల స్థలాన్ని ఇస్తున్నామని ప్రకటించించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande