తిరుపతి, 21 అక్టోబర్ (హి.స.)
, :వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిక తిరుపతి ఎస్వీ వర్సిటీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై భూమన చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ విషయంలోనే ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విచారణ హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ