తెలంగాణ, 21 అక్టోబర్ (హి.స.)
హైదరాబాద్లోని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ నందు పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ. . సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిత్యం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది కాలంలో 191 మంది పోలీసులు వీరమరణం పొందారని చెప్పారు. శాంతి భద్రతలు లేకుంటే సమాజంలో అభివృద్ధి ఉండబోదని వెల్లడించారు. రాష్ట్రంలో నేరాలు జరుగకుండా అనేక ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ తో ప్రజల విశ్వాసం చూరగొంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ విభాగం త్యాగస్ఫూర్తిని స్మరించుకునేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. నేటి నుంచి వారం రోజుల పాటు వారోత్సవాలు కొనసాగనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు