హైదరాబాద్, 21 అక్టోబర్ (హి.స.)
దీపావళి పండుగ వేళ హైదరాబాద్లో పటాకుల (Diwali crackers) వల్ల కొందరు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం రాత్రి నుంచి నగరంలోని సరోజిని కంటి ఆసుపత్రిలో భారీ స్థాయిలో బాధితులు చేరారు. ప్రస్తుతం చాలా మంది ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నట్లు సమాచారం. నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు దాదాపు 70 మంది ఆసుపత్రిలో చేరారు. బాధితుల్లో 20 మంది చిన్నారులు కూడా ఉన్నారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
నగరంలో పలుచోట్ల టపాసులు చేతిలో పేలడం, కళ్లలో ముక్కలు పడడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గాయపడిన వారికి తగిన చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఇంకా కేసులు వచ్చినా చికిత్స చేయడానికి పూర్తి సన్నాహాలు చేశామని తెలిపారు. మరోవైపు టపాసుల వల్ల గాయాలైన బాధితులు పలు ప్రైవేటు కంటి ఆసుపత్రులను కూడా ఆశ్రయిస్తున్నారు. ప్రతి సంవత్సరం దీపావళి రోజున ఇలాంటి ఘటనలు పునరావృత మవుతున్నాయి. ప్రజలు బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, అధికారులు హెచ్చరిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..