కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానలకు సుస్తి: హరీశ్ రావు
హైదరాబాద్, 21 అక్టోబర్ (హి.స.) కేసీఆర్పై కోపంతో కేసీఆర్ కిట్లు తీసేయడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. పేదల ఆరోగ్యంపై రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖాన్లకు సు
హరీశ్ రావు


హైదరాబాద్, 21 అక్టోబర్ (హి.స.) కేసీఆర్పై కోపంతో కేసీఆర్ కిట్లు తీసేయడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. పేదల ఆరోగ్యంపై రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖాన్లకు సుస్తీ పట్టిందని మండిపడ్డారు. శేరిలింగంపల్లిలో బస్తీ దవాఖానను హరీశ్ రావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా దవాఖానలో సదుపాయాలను పరిశీలించారు. ఏఏ మందులు అందుబాటులో ఉన్నాయి, వైద్య పరికరాలు పనితీరు, వైద్య సేవల వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. జీతాలు అందుతున్నాయా అని సిబ్బందిని అడగడంతో.. నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదని తమ కష్టాలను హరీశ్ రావుతో చెప్పుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande