ఆంధ్రప్రదేశ్ లోని. జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి
అమరావతి, 21 అక్టోబర్ (హి.స.) ,: నైరుతి రుతుపవనాలు వెళ్లినప్పటికీ దేశంలోని పలు రాష్ట్రాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈశాన్య రుతుపవనాల రాకతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌ల
ఆంధ్రప్రదేశ్ లోని. జిల్లాల్లో  భారీగా వర్షాలు కురుస్తున్నాయి


అమరావతి, 21 అక్టోబర్ (హి.స.)

,: నైరుతి రుతుపవనాలు వెళ్లినప్పటికీ దేశంలోని పలు రాష్ట్రాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈశాన్య రుతుపవనాల రాకతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వానలు కురుస్తున్నాయి. ఈ నెల 17వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి మరింత తీవ్రరూపం దాల్చిందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. గురువారం నాటికి దక్షిణమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండంగా మారడానికి వాతావరణం అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. ఈ తరుణంలోనే ఇవాళ బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశము ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతోపాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande