తిరుమల.కోభక్తుల రద్దీ పెరిగింది
అమరావతి, 21 అక్టోబర్ (హి.స.) తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ కృష్ణతేజ అతిథి గృహం వరకు విస్తరించింది. శ్రీవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు గంటల తరబడి క్యూలైన్ల
తిరుమల.కోభక్తుల రద్దీ పెరిగింది


అమరావతి, 21 అక్టోబర్ (హి.స.) తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ కృష్ణతేజ అతిథి గృహం వరకు విస్తరించింది. శ్రీవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. ఇక, నిన్న శ్రీవారిని 72,026 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,304 మంది తలనీలాలు సమర్పించగా, రూ.3.86 కోట్ల హుండీ ఆదాయం లభించింది.

అయితే, టీటీడీ అధికారులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో ఉన్న వారికి తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు, విశ్రాంతి ఏర్పాట్లు చేయడంతో భక్తులు సౌకర్యంగా దర్శనం పొందేలా చర్యలు తీసుకుంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande