రియాజ్ ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి.. మానవ హక్కుల వేదిక డిమాండ్
హైదరాబాద్, 21 అక్టోబర్ (హి.స.) హైదరాబాదులో జరిగిన రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై మానవ హక్కుల వేదిక కీలక ప్రకటన చేసింది. ఈ ఎన్కౌంటర్ను సుమోటోగా తీసుకొని, విచారణ జరిపి, చట్ట ఉల్లంఘనదారులు ఎంతటి వారైనా వారికి శిక్షలు పడేలా చేయాలని హైకోర్టును, తెలంగాణ మానవ
రియాజ్ ఎన్కౌంటర్


హైదరాబాద్, 21 అక్టోబర్ (హి.స.) హైదరాబాదులో జరిగిన

రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై మానవ హక్కుల వేదిక కీలక ప్రకటన చేసింది. ఈ ఎన్కౌంటర్ను సుమోటోగా తీసుకొని, విచారణ జరిపి, చట్ట ఉల్లంఘనదారులు ఎంతటి వారైనా వారికి శిక్షలు పడేలా చేయాలని హైకోర్టును, తెలంగాణ మానవ హక్కుల కమిషన్ను కోరుతున్నాం.. ఈ ఎన్ కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను తక్షణమే సస్పెండ్ చేసి వారిపై హత్య నేరం మోపాలి. రియాజ్ చేతిలో మరణించిన ప్రమోద్ కుటుంబానికి మా హృదయపూర్వక ప్రగాఢ సానుభూతి.” అని మానవ హక్కుల వేదిక తెలంగాణ పేరిట విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande