జపాన్ చరిత్రలో సరికొత్త రికార్డు.. ప్రధానిగా తొలి మహిళ..
హైదరాబాద్, 21 అక్టోబర్ (హి.స.) జపాన్(Japan) చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. జపాన్ ప్రధానిగా తొలిసారి ఓ మహిళ ఎన్నికయింది. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు సనే తకైచి (Sanae Takaichi) ఎన్నికయ్యారు. కాగా పార్టీలో అంతర్గత గొడవల కారణంగా జపాన
జపాన్ పీఎం


హైదరాబాద్, 21 అక్టోబర్ (హి.స.)

జపాన్(Japan) చరిత్రలో సరికొత్త

రికార్డు నమోదైంది. జపాన్ ప్రధానిగా తొలిసారి ఓ మహిళ ఎన్నికయింది. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు సనే తకైచి (Sanae Takaichi) ఎన్నికయ్యారు. కాగా పార్టీలో అంతర్గత గొడవల కారణంగా జపాన్ ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో పార్లమెంట్ సభలో సభ్యులు సనై తకైచిని ఎన్నుకున్నారు. అయితే ఇటీవల జపాన్ లో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటు ఎగువ సభలో అధికార పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీని సాధించలేకపోయింది.

దిగువ సభలో కూడా మెజార్టీ కోల్పోగా.... ఇషిబాపై ఒత్తిడి పెరిగి ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఈక్రమంలోనే శనివారం పార్టీలో ఎన్నికలు జరగ్గా.. మాజీ ప్రధాని కుమారుడు షింజిరో కోయిజుమితో పాటు మరో ముగ్గురు అభ్యర్థులను ఓడించి మరీ... తకైచి విజయం సాధించింది. అలాగే నేడు పార్లమెంట్లో ఓటింగ్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, జపాన్ ఇన్నోవేషన్ పార్టీ కూటమితో.. తకైచికి భారీ మద్దతు లభించింది. దీంతో జపాన్కు తొలి మహిళా ప్రధానిగా తకైచి అరుదైన రికార్డుసాధించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande