జూబ్లీహిల్స్ లో నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు..
హైదరాబాద్, 21 అక్టోబర్ (హి.స.) జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. అక్టోబర్ 13 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో ఇప్పటివరకు 127మంది నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. వీరిలో ప
జూబ్లీహిల్స్


హైదరాబాద్, 21 అక్టోబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది.

అక్టోబర్ 13 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో ఇప్పటివరకు 127మంది నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. వీరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు చిన్న పార్టీల ప్రతినిధులు, స్వతంత్రులు ఎక్కువగా ఉన్నారు. మంగళవారంతో నామినేషన్లకు గడువు ముగియనుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు మరోసెట్ నామినేషన్ పత్రాలు సమర్పించడానికి సిద్ధమయ్యారు. బుధవారం నుంచి నామినేషన్ పత్రాల పరిశీలన, 24 వరకు ఉపసంహరణకు సమయం ఉన్నది. నవంబర్ 11న పోలింగ్ జరుగనుంది. అదే నెల 14న ఫలితాలు వెలువడుతాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande