కాంగ్రెస్ పార్టీకి నీతి, రీతి ఏమైనా ఉందా?.. దానం వ్యవహారంపై కేటీఆర్ హాట్ కామెంట్స్
హైదరాబాద్, 21 అక్టోబర్ (హి.స.) కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మా పార్టీకి చెందిన ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉండటం ఏంటి అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఏఐసీసీ విడు
కేటీఆర్


హైదరాబాద్, 21 అక్టోబర్ (హి.స.)

కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్

వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మా పార్టీకి చెందిన ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉండటం ఏంటి అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఏఐసీసీ విడుదల చేసిన స్టార్ క్యాంపెనర్ల జాబితాలో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్ పేరు ఉండటంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇవాళ ఖైరాతాబాద్ బస్తీదవాఖానాను పరిశీలించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కు నీతి, రీతి ఏమైనా ఉందా అని నిలదీశారు. అది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదని ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ అని ఎద్దేవా చేశారు. మా పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయి కరప్షన్ కు పాల్పడిందని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్యెల్యేలు స్పీకర్ వద్ద ఒకలా బయట మరోలా వ్యవహరిస్తున్నారని.. వారు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande