కరీంనగర్, 21 అక్టోబర్ (హి.స.)
పోలీసు అమరుల త్యాగాలు
వెలకట్టలేనివని, వారి సేవలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి తెలిపారు. మంగళవారం పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ.. అమరుల స్థూపానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పుడే ప్రజలు సుఖశాంతులతో సంతోషంగా ఉంటారన్నారు. పోలీసు అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు, వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. శాంతి భద్రతలను కాపాడుకుంటూ అభివృద్ధి పథంలో దూసుకు వెళుతున్నామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు