ముంచుకొస్తున్న అల్పపీడనం.. 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు!
అమరావతి, 21 అక్టోబర్ (హి.స.)దక్షిణ అండమాన్ సముద్రం, దాని సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ ఎత్తువరకు ఉరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం వచ్
Rain


అమరావతి, 21 అక్టోబర్ (హి.స.)దక్షిణ అండమాన్ సముద్రం, దాని సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ ఎత్తువరకు ఉరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం వచ్చే 24 గంటలలో పశ్చిమ, వాయువ్య దిశలో కదిలి బలపడి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతం, దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండం గా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మంగళ, బుధ వారాల్లో తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో ఈ రోజు, రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి ఉరుములతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

ఇక గురు, శుక్రవారాల్లో హైదరాబాద్‌ సహా ఖ‌మ్మం, న‌ల్లగొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడ‌క్కడ భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, సిద్దిపేట‌, ములుగు, హ‌నుకొండ‌, వ‌రంగ‌ల్, మ‌హ‌బూబాబాద్‌, భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలిక‌పాటి నుంచి మోస్తరు వ‌ర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ైరుతి రుతుపవనాలు వెళ్లినప్పటికీ ఈశాన్య రుతుపవనాల రాకతో దేశవ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. వీటికితోడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా మారనుంది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వానలు దంచికొడుతున్నాయి. మంగళవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేటి నుంచి వరుసగా 3 రోజులు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురవనుంది. మిగిలిన జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే తప్ప బయటకు రావొద్దంటూ వాతావరణ అధికారులు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande