హైదరాబాద్, 21 అక్టోబర్ (హి.స.)
దీపావళి పండుగ వేళ తెలుగు చిత్రసీమలోని స్టార్లు ఒక్కచోట చేరారు.
హైదరాబాద్లోని తన నివాసంలో దివాళి పార్టీ నిర్వహించిన చిరంజీవి సహ నటులను ఆహ్వానించారు. మెగాస్టార్ పిలుపునందుకున్న టాలీవుడ్ స్టార్లు విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగార్జున కుటుంబ సమేతంగా చిరు ఇంటికి వెళ్లారు. 'మన శంకర వరప్రసాద గారు'చిత్రంలో నటిస్తున్న నయనతార కూడా పార్టీకి హాజరైంది.
తన నివాసానికి దీపావళి పార్టీకి వచ్చిన నాగ్, విక్టరీ వెంకీలతో పాటు నయన కు చిరు, ఆయన సతీమణి సురేఖ సాదరంగా ఆహ్వానం పలికారు. సూపర్ స్టార్లంతా ఒక చోట చేరడంతో పండుగసంబురం అంబరాన్నంటింది. ప్రస్తుతం చిరుఇంట్లో జరిగిన పార్టీ సందర్భంగా.. నాగార్జున, వెంకటేశ్, నయన తారలతో చిరంజీవి దిగిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..