పోలీసు అమరవీరులకు ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
నాగర్ కర్నూల్, 21 అక్టోబర్ (హి.స.) ప్రజల భద్రత కోసం కష్టపడే నిరంతర శ్రామికులు పోలీసులని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన
నాగర్ కర్నూల్ కలెక్టర్


నాగర్ కర్నూల్, 21 అక్టోబర్ (హి.స.)

ప్రజల భద్రత కోసం కష్టపడే నిరంతర

శ్రామికులు పోలీసులని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పోలీస్ అమర వీరుల స్తూపం వద్ద కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసులు 24 గంటలు ప్రజల కోసం తమ ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేస్తున్నారని కొనియాడారు. ఎంతో మంది పోలీసులు విధి నిర్వహణలో దేశం కోసం తమ ప్రాణాలను పోగొట్టుకున్నారని, అది గుర్తు చేసుకోవడం కోసమే అక్టోబర్ 21వ తేదీని పోలీస్ అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అన్ని ప్రభుత్వ శాఖల కన్నా పోలీస్ శాఖ 24 గంటలు పనిచేస్తూ లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకుండా పనిచేస్తున్నారని కలెక్టర్ అభినందించారు. దేశ రక్షణలో పారా మిలిటరీ పోలీస్ శాఖలు పని చేయడం వలనే దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నామని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande