సమాజ సంరక్షకులు పోలీసులు.. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం
హైదరాబాద్, 21 అక్టోబర్ (హి.స.) ప్రపంచమంతా నిద్రపోయినా మేల్కొని ఉండే ఒకే ఒక్కడు.. పోలీస్. ప్రపంచమంతా నిద్రలో ఉంటే వీరు శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగ పబ్బాల్ని
పోలీస్


హైదరాబాద్, 21 అక్టోబర్ (హి.స.)

ప్రపంచమంతా నిద్రపోయినా మేల్కొని ఉండే ఒకే ఒక్కడు.. పోలీస్. ప్రపంచమంతా నిద్రలో ఉంటే వీరు శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగ పబ్బాల్ని కూడా త్యజించి, ప్రజల కోసం జీవించి, మరణించిన పోలీసు అమరవీరులు ఎందరో... ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి సానుభూతి, గౌరవం చూపిం చడం మనందరి బాధ్యత. పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబో తున్న వారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశం. అక్టోబర్ 21 అంటే పోలీసు అమరవీరుల దినం. గతంలో ప్రపంచాన్ని అంతా అతలాకుతలం చేసిన కరోనా గత్తర కాలంలో పోలీసుల సేవలు మరువలేం. మన కాళ్లు బయటకు రాకుండా.. నిత్యం శ్రమిస్తూ అనేక మంది ఆ మహమ్మారి కరోనా కాటుకు బలైనారు. పోలీసు విధి నిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నది. ఇతర ఉద్యోగుల్లా కొన్ని గంటలకు మాత్రమే పరిమితమయింది కాదు. ఇరవై నాలుగు గంటల ఉద్యోగం ఒక్క పోలీసు ఉద్యోగమే. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం. అన్ని పరిస్థితుల్లో అన్ని వేళల్లో పోలీసులే ముందుం టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande