ప్రజల భద్రత, రక్షణ కోసం పోలీసుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయం.. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి, 21 అక్టోబర్ (హి.స.) దేశ భద్రత, ప్రజారక్షణ కోసం పోలీసులు చేస్తున్న సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని, అవి సమాజానికి స్పూర్తిదాయకమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈ రోజు భూపాలపల్లి పోలీస్ కార్యాలయంలో పోలీసు అమరవీరులకు
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర


భూపాలపల్లి, 21 అక్టోబర్ (హి.స.)

దేశ భద్రత, ప్రజారక్షణ కోసం పోలీసులు చేస్తున్న సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని, అవి సమాజానికి స్పూర్తిదాయకమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈ రోజు భూపాలపల్లి పోలీస్ కార్యాలయంలో పోలీసు అమరవీరులకు జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే తో కలిసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా జీవించగలుగు తున్నారంటే అది పోలీసుల నిబద్ధతతో కూడిన సేవల ఫలితం అన్నారు. రోజు రోజుకీ పెరుగుతున్న నేరాలను అదుపు చేయడంలో పోలీసులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని, కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల భద్రత కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజలు కూడా పోలీసుల విధులకు సహకరించి, సమాజ శాంతి, భద్రత కోసం తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.అమర వీరుల కుటుంబాలకు బహుమతుల ప్రదానం చేశారు. అనంతరం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని ప్రారంభించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande