పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి.. ఎనిమిది మంది అరెస్ట్
మెదక్, 21 అక్టోబర్ (హి.స.) పేకాట ఆడుతున్న ఇంటి పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మెదక్ జిల్లా ఎస్పీ ఆదేశాలతో విశ్వసనీయమైన సమాచారం ఆధారంగా మండల కేంద్రమైన చేగుంటలో సోమవార
పేకాట


మెదక్, 21 అక్టోబర్ (హి.స.)

పేకాట ఆడుతున్న ఇంటి పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మెదక్ జిల్లా ఎస్పీ ఆదేశాలతో విశ్వసనీయమైన సమాచారం ఆధారంగా మండల కేంద్రమైన చేగుంటలో సోమవారం అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు పేకాట ఆడుతున్న స్థావరం పై దాడి నిర్వహించారు.

ఈ దాడిలో మొత్తం 8 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.58,060/-నగదు 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, స్వాధీనం చేసిన వస్తువులను చేగుంట పోలీస్ స్టేషన్కు అప్పగించి, కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డీవీ. శ్రీనివాసరావు మాట్లాడుతూ జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande