నిర్మల్, 21 అక్టోబర్ (హి.స.)
బాసర మండల కేంద్రంలో పులి సంచారం స్థానిక ప్రజలను కలవరపెడుతుంది. గత వారం రోజులుగా పులి మండలంలోని ఓని వాగు సరిహద్దు ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అక్కడ రైతులు తెలుపుతున్నారు. తాజాగా మంగళవారం ఉదయం రోజు వారి పనుల నిమిత్తం మండల కేంద్రానికి వస్తున్న చుట్టుపక్కల గ్రామ ప్రజలు పులి ని ప్రత్యక్షంగా చూసి కలవరానికి గురయ్యారు. అక్కడే ఉన్న తోటి రైతులతో పులి సంచరించిన ప్రాంతంలోని పాదముద్రలను చూసి పులి నివ్వెరపోయారు. గత వారం రోజులుగా చుట్టుపక్కల ప్రదేశాల్లో సంచరిస్తున్నట్లు అందరు చెబుతున్న మామూలుగా తీసుకున్న బాటసారులు ప్రత్యక్ష సాక్షులు, పులి పాదముద్రలను చూసి షాక్ గురవుతున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు