తెలంగాణ, 21 అక్టోబర్ (హి.స.)
హనుమకొండ పోలీస్ హెడ్క్వార్టర్స్లో మంగళవారం పోలీస్ స్మృతి పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు, పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్య శారద, వరంగల్ నగర కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, ఎన్పీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన, అమరులైన పోలీస్ అధికారులకు నివాళులు అర్పించారు. అమరవీరుల కుటుంబాలను గౌరవిస్తూ వారికి బహుమతులు అందజేశారు. పోలీస్ హెడ్క్వార్టర్ నుంచి అశోక జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యేలు, అధికారులు, పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు