అమరావతి, 21 అక్టోబర్ (హి.స.)హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. చివరి రోజున ప్రధాన పార్టీల అభ్యర్థులు మరో సెట్ నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఇప్పటి వరకు 127 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ భాజపా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఆ పార్టీ అగ్రనాయకులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
నామినేషన్లను అక్టోబర్ 22న పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు 24. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ